శరీరంలో మెలినిన్ శాతం తక్కువ ఉంటే కొందరికి పెదవులు మంచి రంగులో ఉంటాయి. ఎక్కువ సేపు ఎండలో ఉన్నా అసమానతలు,వాడే మందులు వల్ల కొందరి పెదవులు నల్లబడుతూ ఉంటాయి. ఇంట్లో లభించే వస్తువులతో పెదవులు నల్లబడ కుండా కాపాడుకోవచ్చు. తేనె,గులాబి నీరు,కీరదోస,కలబంద రసం కలిపి రోజు పెదవులపై రాసుకోవాలి. కీరదోస ముక్కలు పెదవులు రుద్దుకోవాలి. అలాగే ఐదారు గులాబీ రేకులు పచ్చిపాలతో రెండు గంటలపాటు నానబెట్టి పేస్ట్ లా చేసి ఈ మిశ్రమాన్ని పెదవులకు పట్టించాలి. ఇలా కొన్నాళ్ళ పాటు చేస్తే పెదవులకు చక్కని రంగు వస్తుంది.

Leave a comment