దుస్తుల విషయంలో ఎంత జాగ్రత్తగా వుంటే అవి ఎక్కువ కాలం పాడైపోకుండా కొత్తవిగా ఉంటాయో నాన్ స్టిక్ ప్యాన్లు అంతే . పాత్రలు బాగా వేడిగా వున్నప్పుడు నీళ్ళ కింద ఉంచకూడదు. ఇలా చేస్తే కోటింగ్ పోతుంది. ప్యాన్ బాగా ఆరిపోయాక ఓ పావు గంట నీరు పూసి నాన పెట్టి అప్పుడు క్లీన్ చేయాలి. లిక్విడ్ డిష్ వాష్ సాఫ్ట్ ఫోమ్ లేదా సాఫ్ట్ నైలాన్ స్పాంజ్ కి వాడాలి. స్క్రాచింగ్ ఫ్యాడ్, మెటల్ స్పాంజ్ వాడకూడదు. చెక్క లేదా ప్లాస్టిక్ గరిటెలు మాత్రమె వాడాలి. ఎక్కువ సేపు ఖాలీ పాత్రల్ని స్టవ్ పై పెట్టి ఉంచితే కూడా కోటింగ్ పోతుంది. వాడేందుకు ముందే పొయ్యి మీద పెట్టి సిమ్ లో వేడెక్కుతూ ఉండగానే నూనె, పదార్ధాలు వేయాలి. అతి తక్కువ నూనె లో పదార్ధాలు చక్కగా ఉడికి పోయే ఈ నాన్ స్టిక్ ప్యాన్లు పాత్రలు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలా కాలం మన్నికగా ఉంటాయి.

Leave a comment