ఎప్పటికప్పుడు ఒక కొత్తదనం కావాలనుకొంటారు యూత్ ఇన్ స్టాగ్రాములో, స్నాప్ చాట్,యుట్యుబ్ ల్లో యాక్టివ్ గా వుండే యువతరం ఒక సేన్ సెషన్ క్రియేట్ చేయాలని కళలు కంటారు. సరికొత్త ట్రెండ్స్ సృష్టిస్తూ ఉంటారు. లైకుల పరంపరలు వచ్చి పడిపోతాయి.  ఇప్పుడు తాజాగా పాప్యూలర్ అయినా మేకప్ ట్రెండ్ వాటర్ మిలన్ ఐ మేకప్. కనురెప్పల పైన గులాబీరంగు, నల్లని గింజల్లా చుక్కలు, కంటి చుట్టూ, ఆకుపచ్చ కోటింగ్. మొత్తంగా ఒక పుచ్చకాయ మాదిరే అలాగే పెదవులు కూడా…. పుచ్చకాయలు ఇష్టపడే ఓ అమ్మాయి ఈ పండును యధాతధంగా కళ్ళు, పెదవుల్లో నింపేసింది. ఇన్ స్టాగ్రామ్ లో అప్ లోడ్ చేసింది. ఆమె చేసిన ఈ వాటర్ మెలాన్ ఐ మేకప్ వెంటనే అందరికీ నచ్చిపోయింది. ప్రస్తుతం ఇదే గిరికీలు కొడుతుంది సోషల్ మీడియా లో. మీరూ ఏదైనా సరదాగా ట్రయ్ చేస్తున్నారా?

Leave a comment