పుష్కలంగా ఎ ,సి విటమిన్లు ఉంటే  క్యారెట్లు ఆరోగ్యానికే కాదు అందానికి ఎంతో మేలు చేస్తాయి అంటున్నారు సౌందర్య నిపుణులు . మొటిమలు తగ్గించటంలో క్యారెట్లు ఖరీదైన క్రీముల కంటే బాగా పనిచేస్తాయి . రెండు  క్యారెట్లు మెత్తగా ఉడికించి గుజ్జులా చేసి అందులో తేనె ,రెండు చుక్కల నిమ్మరసం వేసి బాగా కలిపి పేస్ మాస్క్ వేసుకొని ఓ అరగంట ఆగి కడిగేస్తే మొటిమలు తగ్గుతాయి . మొటిమలు చితికి అందులో సీఓమ్ బయటికి రాకుండా ఉంటే క్యారెట్స్ తిన్నా ఫలితం ఉంటుంది . క్యారెట్ రసం తీసి మొటిమల పైన అద్దితే అవి ఎండిపోయి క్రమంగా తగ్గుతాయి . క్యారెట్ మంచి క్లెన్సర్ . ఉప్పు కలిపిన క్యారెట్ రసంతో ముఖం పైన మెల్లగా రుద్దితే మురికి ,నల్లమచ్చలు పోతాయి .

Leave a comment