ఇప్పటికీ మహారుచికరమైన పదార్ధాల్లో వేడన్నం లో పప్పులో  నెయ్యి కలుపుకోవటం కూడా మొదటివరసలో  వుంటుంది. నెయ్యంత రుచి సనాతన భారతీయ సిద్ధాంతం నెయ్యి మంచిదని మొత్తుకున్నా మనం కవన్నీ భయం వేసి తినం. కానీ ఆయుర్వేదంలో నెయ్యికి రసాయనమానేపేరుంది. అంటే రోగనివారిని అని అర్ధం. నెయ్యి కొవ్వు  కాదు అది మజ్జిగ చిలికి తీసిన మృదువైన అమృతం నెయ్యి నెలల తరబడి నిలవుంటుంది. సువాసనలు వెదజల్లే తూనే  ఉంటుంది. రోజూ తప్పని సరిగా నెయ్యి తినమని చెపుతోంది ఆయుర్వేదం మనం తిన్న ఆహారం చక్కగా జీర్ణం అయ్యేందుకు నెయ్యి ఉపయోగ పడుతుంది. నెయ్యిలోని బీటాకెరోటిన్ విటమిన్  ఇవి  మంచి ఆక్సిడెంట్లు నెయ్యి మెదడుకు మేలు చేస్తుంది . అలాగే జీర్ణకోశం లోని మ్యూకస్ పొరను రక్షించేందుకు కూడా నెయ్యి ఉపాయాగపడుతుంది. నెయ్యి కొంచమైనా ఆహారంలో కలుపుకోవటం ఆరోగ్యమే రుచికరమే.

Leave a comment