ఆర్ధికశాఖ నివేదిక ఏమంటోందంటే భారతీయ సమాజంలో ఇంకా అబ్బాయే వంశాన్నీ ఉద్దరిస్తారనే ఆలోచన పోలేదు.అలా కొడుకు కోసం ఎదురుచూస్తూ 2 కోట్ల 10లక్షల మంది ఆడపిల్లల్నీ కన్నారట. దంపతులు ఇప్పటికి లింగ నిర్ధారణ పరిక్షల వల్లనూ పుట్టబోయేది ఆడపిల్ల అయితే అబార్షన్ల వల్ల భారతీయ జనాభాలో 6 కోట్ల 30 లక్షల మంది అమ్మాయిలు తుడిచిపెట్టుకు పోయారని ఈ ఆర్ధిక సర్వే చెపుతుంది. ఇంకా ఘోరం ఏమిటంటే మగబిడ్డ పుట్టాలంటే ఫలానా ప్రత్యేక మైన రోజున దంపతులు కలవాలనీ ,ఫలానా వైపుకు తలపెట్టి నిద్ర పోవాలని నమ్మే వాళ్ళు ఎంతో మంది ఉన్నారట.

Leave a comment