పదమూడేళ్ళ పిల్లల కోసం ఫేస్ బుక్ తీసుకువచ్చిన మెసెంజర్ కిడ్స్ యాప్ వెనక్కి తీసుకొమ్మని చిన్న పిల్లలకు యాప్ తేవటం బాధ్యత రహితమని ఆగ్రహాం వ్యక్తం చేస్తూ వందల మంది వైద్య నిపుణులు ఫేస్ బుక్ చీఫ్ మార్క్ జుకర్ బర్గ్ కి బహిరంగ లేఖ రాశారట. మెదడు పరిపక్వత లేని వయసులో సోషల్ మీడియా పిల్లలకు క్షేమం కాదని డాక్టర్లు రాస్తే ఆన్ లైన్ సేప్టీ నిపుణుల సహాయంతో యాప్ రూపొందించమని మెసెంజర్ యాప్ ఓపెన్ కావాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పని సరి అని ఫేస్ బుక్ వాళ్ళు సమాధానం ఇచ్చారు. తల్లిదండ్రులు వేరే చోట ఉద్యోగాల్లో ఉంటే ఈ యాప్ పిల్లల క్షేమ సమాచారం తెలియజేస్తూ ఉంటుందని ఇది పిల్లలకు ఉపయోగం అని ఫేస్ బుక్ వాదిస్తుంది.

Leave a comment