టెక్నాలజీ మనుషులకు మేలు,కీడు సమాన నిష్పత్తి లో చేస్తుంది అంటున్నాయి అధ్యయనాలు. పిల్లల చేతుల్లో స్మార్ట్ ఫోన్స్ కనిపిస్తున్నాయి. అదో వ్యసనం గా మారింది. ఆ ఫలితంగా,చదువు ఆరోగ్యం రెండు దెబ్బతింటున్నాయి. ఫోన్ లో ఎక్కువ సమయం గడిపే పిల్లల్లో ఒంటరి తనం ఉద్రేకం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి అంటున్నారు పరిశోధనలు. వాళ్ళకి చదువు పట్ల ఆసక్తి తగ్గుతోందని పరీక్షలంటే కంగారు పడుతారని చెపుతున్నారు. మూడు వందల మంది కాలేజీ విద్యార్థులు పైన చేసిన ఒక తాజా అధ్యయనంలో వారు డిజిటల్ టెక్నాలజీ వాడేతీరు,వారిలో ఉద్రేకస్థాయి,ఒంటరితనం చదువులో ప్రతిభ కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన మొదలైన విషయాల పైన అధ్యయనం చేశారు. ఇంటర్నెట్ కు అలవాటు పడిన విద్యార్థుల్లో చదువులో మెరుగైన ఫలితాలు కనిపించలేదని పరిశోధకులు చెప్తారు.

Leave a comment