2018 అక్టోబర్ లో 29 కోట్ల ఖర్చుతో తెరకెక్కిన బదాయి హో సినిమా 221 కోట్లు సాధించింది. ఈ సినిమాలో నటించిన 59 ఏళ్ళ నీనా గుప్తా స్టార్ స్క్రీన్ అవార్డ్ ల్లో ఉత్తమ నటిగా ఎంపికైంది. ఈ పోటీలో ఆలియ భట్ ,దీపికా పదుకొనే వంటి స్టార్ లను పక్కన పెట్టి ఈ అవార్డ్ గెలుచుకొన్నారు నీనా గుప్తా. చాలా కాలం నుంచి నటనకు దూరంగా ఉన్నారు నీనా గుప్తా. వీరర్ వెడ్డింగ్ ముల్కీ ,బదాయి హో సినిమాలతో ఆమె మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ వయసులో నన్ను ఉత్తమ నటిగా అవార్డ్ కు ఎంపిక చేశారంటే నటులకు వయసుతో పని లేదన్నట్లే కదా. మధ్య వయస్సు వచ్చిన హీరోలకు అవార్డ్ ఇస్తారు కానీ హీరోయిన్స్ కు ఆవ్వరు. ఒక పెద్ద మార్పుకు ఇది సంకేతం అన్నది నీనా గుప్తా.

Leave a comment