కొన్ని వందల మంది యువకులపై చేసిన ఒక సర్వే లో అబ్బాయిలు తాము గతంలో ఏ ఫంక్షన్ కు ఏ టాప్ వేసుకున్నారో సరిగ్గా గుర్తు పెట్టుకోలేరని తేలింది. ఈ సర్వే లో పాల్గొన్న అమ్మాయిలు రెండేళ్ళ క్రితం ఏ పార్టీకి ఏ టాప్ లు వేసుకుపోయారో కూడా గుర్తు పెట్టుకున్నారు వాళ్ళవే కాదు దగ్గరి స్నేహితులని, లేదా ఆ పార్టీలో అత్యంత ఆకర్షణీయంగా అనిపించినవి కూడా గుర్తు పెట్టుకున్నారు. ఒంటరిగా షాపింగ్ కు వెళితే అమ్మాయిలు చాలా త్వరగా తమకు కావలసినవి సెలెక్ట్ చేసుకుంటారు గానీ అబ్బాయిలకు కష్టమే ఈ ఎంపికలు పెళ్ళయ్యాక చాలా మంది మగవాళ్ళు తమ టాప్ సెలక్షన్ బాధ్యత బార్యలకే అన్నారట . ఫంక్షన్లకు కూడా భార్య సెలక్షన్ కోరుకుంటారు ఒక ప్రసిద్ధ ఫ్యాషన్ డిజైనింగ్ కంపెనీ ఈ సర్వే తర్వాత,సాదారణంగా ఆడవాళ్ళ కళ్ళకు ఆకర్షించ గలిగే రంగులతోనే ఆ సంవత్సరపు ఫ్యాషన్ దుస్తులు రూపొందించారు.

Leave a comment