చాలా మందిలో తరుచు కనిపించే డిప్రషన్ అప్పటికప్పుడు వచ్చింది కాదని అది తల్లి గర్భం లొంచే మొదలవుతుందని అంటున్నారు పరిశోధకులు . గర్భవతి తరుచు డిప్రషన్ గురయితే ఆ ప్రభావం గర్భస్థు శిశువు పై ఉంటుందని మెదడు పనితీరుని తల్లి పడే డిప్రషన్ ప్రభావితం చేస్తుందని చెపుతున్నారు . కొన్ని వందల కుటుంబాల్లో మహిళలు పిల్లల ప్రవర్తన మీద అధ్యయనం నిర్వహించారు . గర్భవతి తీవ్రమైన డిప్రషన్ గురయితే ఆమెకు పుట్టిన శిశువు పెద్దయిన తర్వాత అదే స్థితి పొందే అవకాశం మూడురెట్లు ఎక్కువ ఉందన్న విషయం వీరు గుర్తించారు . దీనికి కారణం ఒత్తిడికి గురయ్యే హార్మోన్లు ఎక్కువ సంఖ్యలో విడుదలై వాటి ప్రభావం గర్భస్థు శిశువు మెదడు పై ప్రభావం చూపిస్తుందంటున్నారు గర్భవతి డిప్రషన్ గురైనట్లు గుర్తిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవలసిందిగా వాళ్ళు సిపార్స్ చేస్తున్నారు .
Categories