గర్భ విచ్చిత్తికి, హై లెవల్ స్ట్రెస్ కి స్పష్టమైన సంబంధం ఉందని పరిశోధకులు చెప్తున్నారు. చైనా లోని ఒక యూనివర్సిటీ జరిపిన ఈ రీసెర్చ్ లో యుక్త వయస్సుకు ముందు తీవ్రమైన వత్తిడి ఉన్న జీవితం గడిపినా, సుధీర్గ కాలం వత్తిడికి గురవుతూ ఉంటే యువతుల్లో గర్బవిచ్చితి ఎక్కువగా జరుగుతోందని తేలింది. సాంఘీక సమస్యలు, మానసిక సమస్యలు, మానసిక బావోద్వేగ సమస్యలు, జీవిత భాగస్వామితో సమస్యలు, డబ్బు గురించి సమస్యలతో  సతమతం అయ్యే వాళ్ళలో  ఈ మిస్ కారేజ్ ఎక్కువ. ఇరువై ఏళ్ళ వయసులో ఉన్న యువతుల్లో 42 శాతం కంటే ఎక్కువ మందిలో ఈ సమస్య గుర్తించారు. ఇందుకు ఆరోగ్య సలహాలు యోగ, ప్రశాంతంగా ఉండేట్లు ప్రాక్టీస్ చేయటం, మంచి ఆహరం తీసుకోవటం ముఖ్యంగా  తన కడుపులో పెరిగే శిశువు గురించి శాంతిగా ఉండాలని ప్రయత్నిచడం మాత్రమే చేయగలిగిన పనులు.

Leave a comment