వేసవికి చెమటతో ఒంట్లో నీరు తగ్గిపోతూ ఉంటుంది. అలాటప్పుడు కుకుంబర్ మింట్ డ్రింక్ తాగితే నీటి భర్తీ తో పాటు శక్తి కూడా వస్తుంది  అంటున్నారు ఎక్సపర్ట్స్.కీరదోస ఒకటి చక్కెర టేబుల్ స్పూన్ పుదీనా ఆకులు పది, నీళ్లు నాలుగు కప్పులు కొద్దిగా బ్లాక్ సాల్ట్ తీసుకోవాలి. కీరా దోస పొట్టు తీసి ముక్కలుగా కోసి మిక్సీ లో వేయాలి తర్వాత చక్కెర పుదీనా ఆకులు కప్పు నీళ్లు మిక్సీ పట్టి అందులో బ్లాక్ సాల్ట్ వేసి కలపాలి. ఇప్పుడా మిశ్రమంలో మిగతా మూడు కప్పులు నీళ్లు పోసి ఐస్ క్యూబ్స్ పుదీనా ఆకులతో గార్నిష్ చేస్తే కుకుంబర్ మింట్ డ్రింక్ సిద్ధంగా ఉంటుంది.

Leave a comment