నీహారికా,
చాలా మంది చిన్న పిల్లలు ఎందుకు వాళ్ళ వయస్సుకు తగినట్టు మాట్లాడటం లేదు. ఎన్నో విషయాల్లో ఆరి తేరిన వాళ్ళుగా వాళ్ళు మాట్లాడుతుంటే అసహజంగా వుంటుంది. ఎక్కడా ఈ సమస్యకు మూలం అన్నావు. ముఖ్యంగా వాళ్ళు ఎక్కువసేపు టెలివిజన్ ముందు కాలక్షేపం చేస్తూ వుంటే అని చెప్పవచు. వాటి ప్రభావం వల్లనే వాళ్ళు చూసే సినిమాలు, అర్ధం పర్ధం లేని సినిమా జోక్స్, అపూర్వమైన సాహసాలు చేసే హీరోలు, వాళ్ళ హీరోయిజం పిల్లల మనస్సుల పై ఘాఢమైన ముద్ర వేస్తుంది. వాటి ప్రభావం తోనే వయస్సుకు మించిన మాటలోస్తున్నాయి. నలుగురిలో ఏం మాట్లాడాలో తెలియక ఎదో ఒక్కటి నోటికొచ్చింది మాట్లాడేస్తూ ఉంటారు. ఇలా చేసే పిల్లల్ని వంటరిగా వదిలేయకుండా తోటి పిల్లలతో ఎక్కువసేపు గడపనివ్వాలి.అలా ఏది పడితే అది మాట్లాడకూడదు అని వాళ్ళకు నచ్చేలా చెప్పాలి. ఆ చెప్పే విధానంలో వాళ్ళు తప్పు వాళ్ళు తెలుసుకోనేలా వుండాలి. అప్పుడు అన్ని మాకు తెలుసనీ ప్రతి దానికి పేచీ పెట్టడం చేస్తే మాత్రం తప్పని సరిగా నియంత్రించాలి. లేకపోతె వాళ్ళు సరైన మంచి మర్యాద నేర్చుకొన్నట్లే. ముద్దు ముద్దుగా వినసొంపుగా వయస్సుకు తగ్గ మాటలు మాట్లాడితేనే ముద్దు.