ఎండలని భరించేలేక పోతాం.కాలు బయటపెట్టలంటే భయపడతాం. కానీ అమెరికా లోని ఒరిగాన్,హార్వర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఇళ్ళల్లో కర్టెన్లు వేసుకోని కృత్రిమమైన విద్యుత్ వెలుగుతో ఉండటం వల్లనే బోలెడన్ని అనారోగ్యాలు అంటున్నారు. ధారాళంగా ఇంట్లోకి గాలి వీచేలా ఎండపొడ తగిలేలా ఇళ్ళు నిర్మించుకొన్న భారతీయుల ముందు చూపును కొని యాడారు. ఏ గదుల్లో సూర్యకాంతి పడదో ఆ గదుల్లో బాక్టీరియా వంటి సూక్ష్మజీవులు అత్యధికంగా ఉండటం గమనించారు. ఇవి శ్వాసకోశ ఇబ్బందులు తెచ్చే రోగ కారకాలని గుర్తించారు. ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే ఇంట్లోకి ఎండ రావాలని ,వంటికీ తగలాలని వారు సలహా ఇస్తున్నారు.

Leave a comment