ఎర్రని వన్నెల మందార పువ్వులో శరీరానికి అవసరమైన ఔషధ గుణాలున్నాయంటున్నారు వైద్యులు. మందారలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. దానీలోని పాలీఫినైల్ శరీరంలోని మలినాలను తొలగిస్తుంది. శరీర ఆరోగ్యం చెడగొట్టే ప్రీ రాడికల్స్ ని నియంత్రిస్తుంది. మందార పువ్వులు ముద్దగా చేసి ఒక చిన్న గుళికగా చేసి పరిగడుపున మింగితే నెల వారీ బహిష్టులో తేడాలు రానివ్వదు. అలాగే మందార పూవులు ఎండనిచ్చి ఆ తైలాన్ని తలకు రాసుకొంటే జుట్టు నిగనిగలాడిపోతుంది. మందార క్యాన్సర్ ని అడ్డుకోవటంలో మందులా పని చేస్తుంది. మందార ఆకులను నీళ్ళలో మరగనిచ్చి ఆ కషాయాన్ని తాగితే జ్వరాలు బాధించవు.

Leave a comment