తల్లిదండ్రులు మగపిల్లలనే ఎందుకు కోరుకుంటారంటే ఆడపిల్లలను రక్షించలేమేమో వాళ్ళకి పెళ్లి చేసే వరకు పెంచటమే ఈ సమాజంలో కష్టం అన్న అభిప్రాయంతో ఇలాంటి పరిస్థితి చూసే డాక్టర్ గా పని చేయటం కంటే ఐ.పి.యస్ చేయటం మంచిది అనుకున్నా అంటారు మహిళా పోలీస్ కమిషనర్ ఆర్తి సింగ్. ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్ లో ఆడ పిల్లలను కనటం గురించే స్త్రీలు వివక్ష ఎదుర్కొంటున్న ప్రాంతంలో పుట్టింది ఆర్తి సింగ్. మహారాష్ట్రలోని అమరావతికి కమిషనర్ గా ప్రస్తుతం పని చేస్తారామె. అక్కడ క్రైమ్ రేట్ చాలా ఎక్కువ. పోలీస్ ల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు పొందిన ఆర్తి సింగ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అవార్డులు అందుకున్నారు.