Categories
Nemalika

పొడుపు పధకాల గురించి విచారించారా?

నీహారికా,

ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక రంగంలో మహిళలు మంచి స్ఫూర్తి నిచ్చే భూమిక్ సమర్ధవంతంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే కానీ వాళ్ళు ఆదాయం సృష్టించే పని లో వుంటారు కానీ పొడుపు మార్ఘాల వైపు ద్రుష్టి పెట్టడం లేదంటారు అంటే పొడుపు చేయడం రాదనీ కాదు. వివిధ ఆదాయ మర్ఘాల్లో పొడుపు చేయడానికి ఇష్ట పడతారు. ధైర్యం చేయడం లేదు. పొడుపు  పదింతలు చేయడం అంటే నష్ట పోవడం అనుకుంటున్నారు. డబ్బు గడించడం ఆదా చేయడం దాన్ని వృద్ది చేయడం కూడా ఒక అవసరమే. అయితే చాలా మందికి మ్యుచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ వంటికి ఆలోచన లోకి కుడా రావు. వివిధ బ్యాంక్స్ లో డిపాజిట్స్, షేర్స్, బాండ్స్, రియల్ ఏస్టేట్స్ బంగారం పై పెట్టుబడి పెట్టి అధిక ఫలితాలు సాధించడం ఇవన్నీ తెలుసుకోవలసిన అంశాలు. ఒక ఆర్ధిక ప్రణాళిక వేసుకునేందుకు ఎన్నో విషయాలు తెలుసుకోవాలి. ఇప్పటి వరకు తెలిసిన పోస్టాఫీస్ ఆర్.డి, పి.పి.ఎఫ్ భీమా పధకాలు వరకే కాకుండా ఈ శతాబ్దంలో ముందుకు వచ్చిన సరికొత్త ఆర్ధిక ప్రణాళికల గురించి అద్యాయినం చేయాలి. పొడుపు, డబ్బు విలువ గురించి పిల్లలను తర్ఫీదు చేసేందుకు ముందు పొడుపు పధకాల గురించి మనకు అవగాహన వుండాలి కదా.

Leave a comment