ఇంటి అలంకరణలో పచ్చదనం ఇవాల్టి రోజుల్లో భాగం. ఇంట్లో ఎలాగో చోటుండదు. అపార్ట్మెంట్స్ కట్టడం ఎక్కువ జానెడు చోటుండదు. ఇక్కడ పచ్చదనం ఎక్కడ అనుకునే వాళ్ళ కొసం ఆర్టిఫిషియల్ ప్లాంట్ ప్యానల్స్ వచ్చాయి. పచ్చదనం చుస్తూ ఉంటే కళ్ళకు ఇంపుగ ఉంటుంది అని నమ్మెవాళ్ళ కొసం ఈ వర్టికల్ గార్డెన్ నిలువుగా గోడపైన పెట్టోచ్చు. ఇవి పెంచే మొక్కలు కాదు.ఆకులు,తీగలు,పూలు ప్లాస్టిక్ తో తయారుచేసుకున్నవి. ప్లాస్టిక్ మెష్ పైన ఈ అకులన్ని అందంగా అమర్చి కనబడతాయి.చతురస్త్రాకారంలో ఉండే ఈ ప్యానెళ్ళు ఒకదాని పక్కన ఒకటి అలంకరించి గోడని పచ్చదనంతో నింపేయచ్చు.ఈ ఆకులు,పూలు అచ్చం ఒరిజనల్ మోక్కలాగా ఉంటాయి.ఏదైన దుమ్ము చేరింది అనుకుంటే శుభ్రంగా కడిగేయచ్చు.

Leave a comment