ఆడపిల్ల పుడితే శ్రీ మహాలక్ష్మి అనుకునే రోజులు పోయి, అసలా పిల్ల ఈ జనారణ్యం మధ్యలో ఎలా బతుకుతుందన్న బాధ పట్టుకోంటుంది తల్లిదండ్రులకు. ఆడపిల్లలు ఇళ్ళల్లో, పని ప్రదేశాల్లో, కాలేజీల్లో కార్యాలయాల్లో ఎదో రకమైన హింసను ఎదుర్కొంతునే వున్నారు. ఇలాంటప్పుడు వాళ్ళకి ఎదిగే వయస్సులోనే కొన్ని ఆత్మ రక్షణ విద్యలు నేర్పిస్తే ఎలా వుంటుంది? ఆపద సమయాల్లో వాళ్ళకి అవి ఉపయోగ పడతాయి అలాగే ఈ విద్యలు వాళ్ళని శరీరకంగా బలంగా కూడా తయ్యారు చేస్తాయి. ఉదాహరణకు ఆర్టరీ అంటే విలువిద్య ఇది కూడా ఆత్మ రక్షణ సాధనమే టార్గెట్ ను ఎలా గురి చూసి కొట్టాలో నేర్చుకోవచ్చు. అనుకోని ఆపద ఎదురైతే కనీసం చేతిలో వున్న వస్తువులతో అవతలి వ్యక్తి పైకి గురి పెట్టి కొట్టడం అయినా వస్తుంది. కర్రసాము కూడా ఇంతే నేర్చుకొంటే భవిష్యత్తులో ఏ సమయంలో అయినా తమని తాము కాపాడుకొంటారు లేదా కరాటే అయితే అత్యుత్తమ ఆత్మరక్షణ సాధ్యం. తమ పై జరిగే దాడి నుంచి తప్పించుకోగలిగే ఆత్మరక్షణా మర్ఘాలు ఆడపిల్లలకు నేర్పించడం ఉత్తమం.
Categories