ఇప్పుడు ఉద్యోగాల కోసం నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు అయ్యే పరిస్థితి లేదు చాలా కంపెనీలు వర్చువల్ ఇంటర్వ్యూల ద్వారానే ఉద్యోగాలను ఎంపిక చేస్తున్నారు. ఈ ఇంటర్వ్యూ కోసం సన్నద్ధం అవ్వాలంటే కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలి వర్చువల్ ఇంటర్వ్యూ కోసం కూర్చున్న గది ప్రశాంతంగా ఉండాలి. వెలుతురు సరిపోను ఉండాలి ముఖం స్పష్టంగా కనిపించాలంటే వెనుక వస్తువులు ఉండకూడదు ఇంటర్వ్యూ సమయంలో ఆ గదిలోకి ఎవరు రావద్దని ముందే ఇంట్లో వాళ్ళకి చెప్పాలి. ఫోన్ సైలెంట్ మోడ్ లో ఉంచుకోవాలి. చక్కగా ఫార్మల్ డ్రెస్ వేసుకోవాలి. కుర్చీలో వలిపోయినట్లు కాకుండా నిటారుగా కూర్చోవాలి కెమెరా వైపు నుంచి చూపు మరల కూడదు ఇంటర్వ్యూ అయ్యాక థాంక్స్ చెప్పాలి.అలా చెప్పినప్పుడు ఉద్యోగం పట్ల ఆసక్తి ఉందని అవతల వాళ్ళు గ్రహిస్తారు.
Categories