ఎంత అందమైన ఇల్లయినా సరే ఎక్కడి వస్తువు అక్కడ వుంచక పోతే సవ్యంగా కనిపించదు. చివరకు స్టోర్ రూమ్ అయినా సరే. సాధారణంగా స్టోరేజీల్లో 30,40 శాతం వాడినవే వుంటాయి. పాత కూలర్లు ఫ్యాన్లు మెషీన్ టూల్స్ ,పాత ఫర్నీచర్స్ ,పుస్తకాలు , బొమ్మలు, దుస్తులు ఏవైనా కావచ్చు. ఏ పండగకో ప్రత్యేక సందర్భానికో సర్దుతాం. ఇలా ఎడతెరిపి లేకుండా పేరుకుపోయే పనికిరాని వస్తువులు సర్దటం తప్ప తీసేద్దామనుకోరు. తీసేసి ఎవరికైనా ఇవ్వటం ప్రతీదాన్ని ఒక్కసారి సరిగ్గా చూసి అవసరం వుందా ఆ అవసరం ఎన్నాళ్ళకు వస్తుందో తేల్చుకుని ఆమేరకు దాన్ని వుంచుకోవటమో ,ఇచ్చేయటమో నిర్ణయించాలి. అలాగే దుస్తులు దొంతరలు కూడా ఇంతే. వార్డ్రోబ్ లు నిండిపోతున్నాయి. వద్దనుకుని డొనేట్ చేయటం బెస్ట్. పాత ఫర్నీచర్ ఎలెక్ట్రికల్ వస్తువులు ఏ ఆక్షన్ హల్లోనో పెట్టేస్తే సరి. ఎంతో కొంత డబ్బొస్తుంది. లేక ఇష్టంలేకపోతే ఎవరికన్నా ఇచ్చేయటం కూడా బేటరే. అంతే గానీ అనవసరమైన పనికిరాని వస్తువులతో మంచి వస్తువులకు చోటు ఇరుకై పోతుంది.
Categories