ఇదివరకు ఇల్లు కట్టుకోవటం అంటే ఇంటి చుట్టూ చెట్ల కోసం జాగా వదిలేసి చుట్టూ అందమైన పూల తోట పండ్ల మొక్కలు పెంచేవాళ్ళు. ఇప్పుడు అంగుళం స్థలం ఊరికే వదలరు. కానీ పచ్చ దనం కోసం మనసు కొట్టుకుపోతూ ఉంటుంది. అప్పుడు ఇస్పాలియర్ పద్దతి కేసి చుడండి అంటున్నారు నిపుణులు. ఏదైనా మొక్కను గోడకు దగ్గరగా వేసి ఎప్పటికప్పుడు అది గోడను అతుక్కునేలా ఉంచేసి ఇవతలకు పెరిగే మొక్కలు కొట్టేయటం. పూలు పండ్లు అలంకరణకు ఉపయోగించే అన్ని రకాల మొక్కలు ఈ పద్దతి లో పెంచవచ్చు. ఇంటి గోడైనా ప్రహరీ గోడైనా మొక్కను నాటటం దాన్ని తీరుగా పెంచటం ఎస్పాలియర్ పద్దతి ముఖ్యమైన విషయం మొక్క పెరగక ముందే ఆ చివరా ఈ చివరా మేకులు కొట్టి తీగలు కట్టాలి. మొక్క పెరుగుతునప్పుడు కొమ్మల్ని ఈ తీగ లోకి  దూర్చుతూ అదనంగా బయటకి వచ్చే కొమ్మల్ని కత్తిరించాలి. ఎంత పెద్దయినా గోడకి ఆనుకుని పెరుగుతాయి తప్ప విస్తరించవు. మందారం మల్లె గులాబీ గన్నేరు లతో పాటు నిమ్మ దానిమ్మ సీతాఫలం లాంటి పండ్ల మొక్కలను పెంచచ్చు. పెరటి గోడలు ఇంటి గోడలు కూడా అందమైన కాన్వాస్ లాగా మారిపోతాయి.

Leave a comment