ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా తన తాజా వెడ్డింగ్ ప్రచారం కోసం ప్లస్ సైజ్ మోడల్స్ సాక్షి సింద్వానీ ని ఎంచుకున్నాడు ఫ్యాషన్ బ్లాగర్, బాడీ పాజిటివ్ ఇన్‌ఫ్లూయన్సర్‌ అయిన సాక్షి సింద్వానీ బొద్దుగా ఉండే స్త్రీల కోసం ఫ్యాషన్ కంటెంట్ తయారు చేస్తుంది. స్పోర్ట్స్‌ బ్రాలు మొదలు కోర్సెట్‌, మినీ స్కర్ట్‌ వంటివి ఫ్యాషన్ లేబుల్స్ ను ప్రమోట్ చేస్తుంది. భారీ కాయంగల మహిళలు వేసుకునేందుకు ‘లీ క్లాతింగ్‌ కొ’ ద్వారా  కొత్త స్టయిల్స్ ను ప్రచారం చేసింది సాక్షి సింద్వానీ మనీష్ మల్హోత్రా తాజా ఫ్యాషన్ ఫిలిమ్ నూరానియత్‌, ది బ్రైడల్‌ ఎడిట్‌ ఒక న్యూ ఏజ్ బ్రైడ్ గా నటించడం తన అదృష్టం అంటోంది సాక్షి సింద్వానీ.

Leave a comment