Categories
Wahrevaa

హైద్రాబాదీ హలీమ్ కు దేశమంతా సలామ్.

సెలబ్రేటిల నుంచి సామాన్యుల వరకు నోరూరే హలీమ్ ఈ రంజాన్ సీజన్ లో తినకుండా ఉండలేరు. హలీమ్ మంచి పోషకాహారం. దీన్ని సింగిల్ డిష్ మీల్ అంటారు. హలీమ్ ఏడాది పొడుగునా తిన్నా శరీరానికి మేలే. హైద్రాబాదీ హలీమ్ ఒక బ్రాండ్ గా గుర్తింపు పొందటానికి కృషి చేసింది ‘పిస్తా హౌస్’. హలీమ్ కి జీ ఐ గుర్తింపు తెచ్చేందుకు కృషి చేసిన ఈ సంస్థకు 546  అవార్డులు వచ్చాయి.హైద్రాబాద్ లో పిస్తాహౌస్ కి 225 విక్రియ కెంద్రాలున్నాయి. తెలంగాణా ని అన్ని జిల్లాల్లో, ఏ. పీ లో విజయవాడ, కడప, బెంగుళూరు, చెన్నాయ్ నగరాల్లో హలీమ్ విక్రయ కేంద్రాలున్నాయి స్విగ్గి సహకారంతో నగరంలో ఆన్ లైన్ ఆర్డర్స్ డెలివరీ చేస్తున్నారు. ప్లేట్, ఫ్యామిలి ప్యాక్ కాకుండా 5,10,15,20 కిలోల పాక్ లు విక్రయిస్తున్నారు. అమెరికాలోన్ కాలిఫోర్నియా, శాన్ప్రాన్సిస్కో, యుఎ ఈ లోను పిస్తా హౌస్ తమ కిచెన్లు ప్రారంబించారు. హలీం ఇప్పుడు వందల కోట్ల వ్యాపారం. నగరంలో తయ్యారయ్యె హలీమ్ లో 28 శాతం 50 దేశాలకు పైగా ఎగుమతి అవుతున్నట్లు అంచనా.

Leave a comment