పాలలో ఉండే లాక్టిక్ యాసిడ్ కాల్షియం పొటాషియం తో పాటు అనేక ప్రోటీన్స్ చర్మకణాలు పునరుత్పత్తిని వేగవంతం చేయడంతో పాటు చర్మాన్ని నిగనిగలాడేలా చేస్తాయి. అందుకే పాలతో ఫేస్ ప్యాక్ వేసుకోండి అంటున్నారు ఎక్సపర్ట్స్. ఓట్స్ ను పాలతో కలిపి ముద్దగా చేసి ముఖానికి మాస్క్ లాగా వేశాక 15 నిమిషాలు వదిలేసి వేడి నీళ్లతో కడిగేయాలి.ఓట్స్ తో పాటు అరటి పండు కూడా కలిపి ప్యాక్ వేస్తే చర్మానికి అదనపు కాంతి వస్తుంది. అలాగే బాగా పండిన బొప్పాయి గుజ్జుతో పాలు కలిపి మొహానికి ప్యాక్ వేసుకున్నా ముఖానికి కాంతి వస్తుంది. ఈ మిశ్రమంలో తేనె కలిపితే చర్మానికి మెరుపు వస్తుంది.

Leave a comment