చాలా మందికి హీరోయిన్లని తెర పైన చూస్తున్న కొద్దీ రోజు రోజుకీ ఇంకా అందంగా అయిపోతున్నారనిపిస్తుంది. శృతి హాస్సన్,శ్రీదేవి, నయినా తార, సామంత, అంజలి, కరీనా, కంగనా, వళ్ళంతా రెండు, మూడేళ్ళ క్రితం చూసినట్లు ఇప్పుడు లేరు మరి ఎలా పెరుగుతుంది ఇంత అందం. వయస్సుతో పాటు అందం పెరుగుతుంటే ఆశ్చర్యంగా వుండదు. అందంగా కనిపించడం, నటించడం కూడా వృత్తిలో భాగమే. ఆహార నియమాలు, వ్యాయామాలు, ప్లాస్టిక్ సుర్జిరీలు, ఇవన్నీ కారణాలే. ఎప్పుడో 8౦ల్లొ శ్రీ దేవి ముక్కుకు శాస్త్ర చికిత్స చేయించుకుంది. ఇప్పుడు బ్యూటీ బిజినెస్ ఆకాశమంత ఎత్తులో వుంది. వయస్సుని తగ్గించి ముడతలు పోగొట్టుకునెందుకు, శరీర ఛాయను పెంచేందుకు రకరాకాల చికిత్స్యలు వస్తున్నాయి. ఖరీదైన క్రిములి, లోషన్లు, ముఖ్యంగా వ్యాయామాలు, శారీరక సౌష్టవం పైన అందం పైన ప్రభావం చూపిస్తున్నాయి. పెర్స్ నల్ ట్రైనర్స్ ఆద్వర్యంలో గంటలకొద్దీ జిమ్ల్లో చెమటోడ్చి కష్టపడి అందం సాధిస్తున్నారు అంటే ఆశ్చర్యం ఏముందీ? నోరు కట్టేసుకోవడం, ఓ గంట సేపు పరుగెట్టాలి అమ్మాయిలు, అద్దం ముందు పడిగాపులు కాచినా ప్రయోజనం శూన్యం.

Leave a comment