త్రీడి జెల్లీ కేక్ తిన్నారు కదు……….. చూసారా అని అడగాలి. పోనీ జెల్లీ కేక్ లు అద్భుతమైన పువ్వులు, ఇవన్నీ కళాత్మకమైన దృష్టితో పిల్లలను ఆకర్షించేందుకు సిరంజీలు, స్పూన్లు, స్ట్రా లు వాడుతూ చేసే కళాకండాలు, కొబ్బరి పాలు, పండ్ల రసాలు, గ్రీన్ టీలు, మిల్క్ షెక్ లు ఎవన్నింటికి జెలటిన్ లేదా సముద్రపు నాచు అగరాను జోడించి ఘనపదార్ధంగా తాయారు చేస్తే అది జెల్లీ అయిపోతుంది. ఇది వరకు జెల్లీ లోపల నిజమైన పండ్లు పూలు పెట్టి డెకరేట్ చేసే వాళ్ళు. ఇప్పుడు పువ్వుల జెల్లీ కేక్ కావాలంటే జెలాటిన్ లో పారదర్శకమైన జెల్లీ కేక్ తాయారు చేసి సిరంజీలు,స్ట్రా లు రకరకాల స్పూన్లు ఉపయోగించి పువ్వుల్ని, ఆకుల్ని అందులో వచ్చేలా చేస్తున్నారు. కేకు పరిమాణం బట్టి ఎన్ని పువ్వులు కావాలంటే అన్ని పువ్వులు సృస్టిస్తారు. ఆసక్తి వున్న వాళ్ళు ఈ త్రీడి జెల్లీ కేక్ ఎలా చేస్తున్నారో యు ట్యూబ్ లో చూసి నేర్చుకో వచ్చు. ఇందుకు కావాల్సిన సమస్తమైన సామాన్లు ఆన్ లైన్ లో కొనుక్కోవచ్చు.
Categories