ఇప్పటి వరకు సంతానోత్పత్తికి స్త్రీల వయస్సే కీలకం అన్న ఉద్దేశ్యంలో 35 సంవత్సరాలు దాటితే గర్భధారణ కష్టమని పిల్లల ఆరోగ్యం కూడా సమస్యగానే ఉంటుందని చెపుతుంటారు.అయితే ఈ సూత్రం పురుషులకు కూడా వర్తిస్తుందట. 45 దాటితే పురుషుల్లో సంతాన సాఫల్యత తగ్గటంతో పాటు పుట్టబోయే బిడ్డకు ఇబ్బందులు ఉన్నట్లు గుర్తించారు. వయస్సు పెరిగేకొద్దీ టెస్టోసైరాన్ శాతం తగ్గటంతో శుక్రకణాలు నాణ్యత తగ్గి ఆ ప్రభావం పుట్టబోయే బిడ్డ డి.ఎన్ ఏ పైన పడటం వల్లనే పిల్లల్లో రకరాల లోపాలు తలెత్తుతున్నాయని అధ్యయనకారులు హెచ్చరిస్తున్నారు.

Leave a comment