అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గుజరాత్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ లో 2022 లో సిగ్నల్ స్కూల్స్ ఆలోచనకు శ్రీకారం చుట్టాయి. మురికివాడల్లో తిరిగే పేద పిల్లల్ని చిన్న వయసులో చదువు మానేసిన వాళ్లని గుర్తించి సిగ్నల్స్ దగ్గర ఆగి ఉండే ఈ బస్సులు వాళ్లను ఎక్కించుకొని సాయంత్రం వరకు పాఠాలు నేర్పిస్తారు. తరువాత వాళ్ళని ప్రభుత్వ పాఠశాలల్లో చేరుస్తారు.ఈ సిగ్నల్ స్కూళ్ల కోసం ప్రభుత్వం మూడు కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. మరికొన్ని నగరాల్లో ఈ విధానం ప్రవేశపెట్టాలని గుజరాత్ ప్రభుత్వం ఆలోచిస్తోంది.

Leave a comment