ఈ వేసవి ఎండలకు కొబ్బరి నీళ్ళు గొప్ప పరిష్కారం. అందులో ఎలక్ట్రో లైట్లు విటమిన్లు,ఖనిజాలు ఉంటాయి. చెమట రూపంలో పోయే లవణాలన్నీ కొబ్బరి నీళ్ళ ద్వారా శరీరానికి అందుతాయి. వ్యాయామం చేసే వాళ్ళకీ ఆటలు ఆడేవాళ్ళకీ ఇవి శక్తిని ఇస్తాయి.పోత పాలు తాగించే తల్లి పాలలా పని చేస్తాయట. తాజాగా ఉండే కొబ్బరి నీళ్ళలో యాంటీ ఆక్సిడేంట్లు కూడా అధికమే. ఇతర పానీయాలు ,కూల్ డ్రింక్ ల కన్నా ఓ గ్లాస్ కొబ్బరి నీళ్ళు నయం కదా!.

Leave a comment