బాడీ షేమింగ్ గురించి విద్యాబాలన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. నల్ల చీర కట్టుకొని, దుప్పట్టాతో తన శరీరాన్ని కప్పుకొని ‘కభీ తూ మోటీ కెహతా హై.. కభీ తూ చోటీ కెహతా హై’ అనే పాటతో మొదలు పెట్టిన ఈ వీడియోలో శరీర ఆకృతి, రంగు కారణంగా చిన్నచూపు, అవమానాలను ఎదుర్కొనేవారికి అండగా నిలబడటంతోపాటు బాడీ షేమింగ్ చేయొద్దని కోరుతూ విద్య ఈ వీడియోను రూపొందించారు.
‘శరీరాకృతి, రంగు, బరువుపై దయచేసి జోకులు వేయకండి. ఎవరికి వారు భిన్నంగా ఉంటారు. ఆ రకంగా ఎవరికి వారు ప్రత్యేకమే’ అని ఆ వీడియోలో ఆమె వ్యాఖ్యానించారు. సామాజిక మాధ్యమాల్లో ‘బాడీ షేమింగ్‌’ కామెంట్లతో తమలో చాలామంది ఎంతో మానసిక వ్యధను అనుభవిస్తున్నామని వాపోయారు. తాను ‘బాడీ షేమింగ్‌’ వ్యాఖ్యలతో అవమానాలకు గురయ్యానని ఆమె పేర్కొన్నారు.
ఓ ఎఫ్‌ఎం రేడియో స్టేషన్‌లో ‘ధున్‌ బదల్‌కే దేఖో’ అనే కార్యక్రమాన్ని విద్య నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆమె.. తమ శరీరాకృతి కారణంగా అనుచిత కామెంట్లను ఎదుర్కొంటూ కొందరు ప్రముఖులు ఎన్నో అవమానాలకు గురవుతున్నారంటూ ఓ వీడియోను పోస్ట్‌ చేశారు.

Leave a comment