పది నిమిషాల పాటు ఏ పని మీదో బైక్ పైన బైటకు వెళ్ళొస్తే చేతులు మొహం మురిగ్గా అయిపోతాయి. అంత కాలుష్యం నిండి వుంటుంది. తప్పని సరిగా చేతులు, మొహం, కాళ్ళు కడుక్కొంటాం. నిపుణులు ఏం చెబుతున్నారంటే ముందస్తుగా చేతులు కడుక్కోండి. చేతులు శుభ్రంగా లేకపోతే ఆ చేతులకున్న బాక్టీరియా, ఇతర క్రిములు చర్మం లోకి వెళ్ళిపోయి మొటిమలు వచ్చే ప్రమాదం ఉంది. మేకప్ వేసుకొని వుంటే దాన్ని తప్పనిసరిగా తొలగించుకోన్నకే ముఖం కడుక్కోవాలి. మేకప్ ను క్లెన్సర్ తో తొలగించుకొని ఫేస్ వాష్ తో కడగాలి. ముఖం కడుక్కోనేందుకు వేడి నీళ్ళు వాడకూడదు. చర్మం పొడిబారిపోతుంది. ముఖానికి చన్నీళ్ళు వాడాలి. చలికాలంలో చర్మం అతిగా రుద్ది కడిగేయోద్దు. పొడిబారిన చర్మాన్ని స్క్రబ్ లు ఇబ్బంది పెడతాయి. రోజుకు రెండుసార్లు ఫేస్ వాష్ వాడవచ్చు. పొడిచర్మం ఉన్నవాళ్ళు మొహానికి కడుక్కున్న వెంటనే మాయిశ్చరైజర్ కాస్త కొబ్బరినూనె అప్లయ్ చేయాలి లేదంటే మొహం ఇంకా పొడిగా అయిపొయింది.
Categories