నీహారికా, ఏది సాధించాలన్నా ఎన్నో సంవత్సరాల పాటు కృషి చేయాలి. కాస్త తేలిగ్గా ఏదైనా వుంటే అన్నావు. చెప్పు నీ ప్రశ్నలో సమాధానం వుందమ్మాయీ.. ‘ సాధించాలంటే .... కృషి’ అంతే కదా. ఇప్పుడు చూడు రెజ్లింగ్ ఛాంపియన్ గీతా ఫోగట్ ఎంత కృషి చేసి వుంటుందో, దంగల్ సినిమాలో ప్రత్యక్షంగా చూశావు. ఒక సముద్రం ఈదాలంటే ఎంత కష్టపడాలో, ఒక క్రికెట్ లో గెలవాలంటే ఎన్ని త్యాగాలు చేయాలో వాళ్ళ వాళ్ళ ఆత్మ కథలన్నీ పుస్తకాల రూపంలో వచ్చాయి. నీ దగ్గర ఉన్నాయి కూడా. బహుశా ఇవన్నీ చూసి ఇలా అన్నావు మనం పెద్ద టార్గెట్స్ కోసం ప్రయత్నించకపోతే పరిమితుల్లోనే బతకాల్సి వస్తుంది. పెద్ద కలలతో జీవితాన్ని ఆవిష్కరించుకోవాలి నీ దృష్టి కోణం మారాలి. బద్దకస్తులదే సులభ మార్గ అన్వేషణ. మనం ఎంత వరకూ ఆలోచిస్తామో అంత ఎత్తే ఉంటాం. మన లోలోపలి ఆలోచనలు మన ఎదుగుదలని నిరోధం చేస్తాయి. ఇప్పుడే జాగ్రత్తగా ఉండాలి నీ ఆలోచనల్లో ఉన్న పరిమితి దాటితే, ఎన్నేళ్ళ పాటు... అన్న నిరాశను పక్కన పెడితే.... నువ్వు ఒక చక్కని భవిష్యత్తుని నిర్మిన్చుకోగలవు. ఒక్క రోజు సౌకర్యవంతంగా వుండకపోతేనే భరించలేవు నువ్వు జీవితం మొత్తం సుఖంగా ఉండాలంటే, దాన్ని ఎంత బాగా నిర్మించుకోవాలి. నువ్వు ఓభవనంలో నివసించాలంటే అది కట్టుకోవలసింది నువ్వే.
Categories
Nemalika

నీ జీవితం నిర్మించుకొనేది నువ్వే

నీహారికా,

ఏది సాధించాలన్నా ఎన్నో సంవత్సరాల పాటు కృషి చేయాలి. కాస్త తేలిగ్గా ఏదైనా వుంటే అన్నావు. చెప్పు నీ ప్రశ్నలో సమాధానం వుందమ్మాయీ.. ‘ సాధించాలంటే …. కృషి’ అంతే కదా. ఇప్పుడు చూడు రెజ్లింగ్ ఛాంపియన్ గీతా ఫోగట్ ఎంత కృషి చేసి వుంటుందో, దంగల్ సినిమాలో ప్రత్యక్షంగా చూశావు. ఒక సముద్రం ఈదాలంటే ఎంత కష్టపడాలో, ఒక క్రికెట్ లో గెలవాలంటే ఎన్ని త్యాగాలు చేయాలో వాళ్ళ వాళ్ళ ఆత్మ కథలన్నీ పుస్తకాల రూపంలో వచ్చాయి. నీ దగ్గర ఉన్నాయి కూడా. బహుశా ఇవన్నీ చూసి ఇలా అన్నావు మనం పెద్ద టార్గెట్స్ కోసం ప్రయత్నించకపోతే పరిమితుల్లోనే బతకాల్సి వస్తుంది. పెద్ద  కలలతో జీవితాన్ని ఆవిష్కరించుకోవాలి నీ దృష్టి కోణం మారాలి. బద్దకస్తులదే సులభ మార్గ అన్వేషణ. మనం ఎంత వరకూ ఆలోచిస్తామో అంత ఎత్తే ఉంటాం. మన లోలోపలి ఆలోచనలు మన ఎదుగుదలని నిరోధం చేస్తాయి. ఇప్పుడే జాగ్రత్తగా ఉండాలి నీ ఆలోచనల్లో ఉన్న పరిమితి దాటితే, ఎన్నేళ్ళ పాటు… అన్న నిరాశను పక్కన పెడితే…. నువ్వు ఒక చక్కని భవిష్యత్తుని నిర్మిన్చుకోగలవు. ఒక్క రోజు సౌకర్యవంతంగా వుండకపోతేనే భరించలేవు నువ్వు జీవితం మొత్తం సుఖంగా ఉండాలంటే, దాన్ని ఎంత బాగా నిర్మించుకోవాలి. నువ్వు ఓభవనంలో నివసించాలంటే అది కట్టుకోవలసింది నువ్వే.

Leave a comment