మనం తీసుకునే ఆహారానికి, ఆరోగ్యానికి అవినాభావ సంబంధం ఉందన్న విషయం తెలిసిందే. చక్కటి పోషకాహారం తీసుకున్నప్పుడే మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దాంతో ఎలాంటి వైరస్‌, బ్యాక్టీరియాకు మన శరీరం లొంగకుండా జాగ్రత్తపడచ్చు. కొన్ని ఆహార పదార్థాలు పచ్చిగా తీసుకోవడం కంటే వండుకొని తింటేనే వాటిలోని పోషకాలు శరీరానికి అందుతాయి.. అలాగే సులభంగా జీర్ణమవుతాయి కూడా! అదే కాయగూరలు ఉడికించడం, డీప్‌ ఫ్రై చేయడం వల్ల వాటిలోని కొన్ని పోషకాలు తొలగిపోయే అవకాశం ఉంది..దుంప జాతికి చెందిన కాయగూరల్ని వండుకునే ముందు తొక్క చెక్కేయడం మనందరం చేసేదే! అయితే కొంతమంది వాటి తొక్కను లోపలి నుంచి చెక్కేస్తుంటారు. దానివల్ల ఆ తొక్క కిందే ఉండే విటమిన్‌-బి, విటమిన్‌-సి, ఫోలికామ్లం.. వంటి పోషకాలు ఉడికించే క్రమంలో నశించిపోతాయి. అందుకే అత్యవసరమైతేనే తొక్క చెక్కేయమంటున్నారు నిపుణులు. లాగే కాయగూరల్ని ఉడికించిన నీరు, అన్నం వండుకున్న తర్వాత వార్చే గంజిలో బోలెడన్ని పోషకాలుంటాయి. కాబట్టి వాటిని పడేయకుండా సూప్స్‌, గ్రేవీల తయారీలో ఉపయోగించచ్చు

Leave a comment