ఆధునికమైన దుస్తులు ఎంచుకుంటే చాలదు అందుకు తగ్గ యాక్సరీస్ కూడా చాలా ముఖ్యం. చక్కని నగలు అందమైన హాండ్ బ్యాగ్ జతచేస్తేనే చక్కని లుక్ వస్తుంది ముఖ్యంగా హ్యాండ్ బాగ్ ఎంచుకునే ముందు జాగ్రత్త తీసుకోవాలి బ్యాగ్ ని ఎలా ఉపయోగిస్తారు అన్నది ముఖ్యం. అందులో వుండే వస్తువులు ఎలాటివి,దాన్ని జాగ్రత్తగా కాపాడతారు,ఎక్కడైనా పర్లేదా వంటి ప్రశ్నలు చాలా ముఖ్యం. కొన ముందు దుస్తులు ట్రయిల్ వేసి చూసుకొన్నట్లు బ్యాగ్ కూడా భుజానికి తగలించుకొని చూసుకోవాలి బ్యాగ్ ఎంత పరిమాణం లో ఉంటే శరీరాకృతికి సరిపోతుంది అన్నది తేల్చుకోవాలి . సన్నగా పొడుగ్గా వుంటే గుండ్రని రకం,సాధారణ బరువుతో వుంటే నాల చదరంగా వుండేవి కాస్త పల్చగా వుండేవి బావుంటాయి. మరీ ఎక్కువ వస్తువులతో నింపకుండా. తేలిగ్గ తీసుకు పోయేలా వుండాలి . ఎప్పుడు రొటీన్ గా వుంటే గోధుమ రంగు,నలుపు కాకుండా దుస్తుల్ని బట్టి భిన్నమైన రంగులను కూడా ప్రయత్నం చేయచ్చు.

Leave a comment