పర్యావరణ ఏది రక్షణకు ఫ్యాషన్ కూడా ఓటేసినట్లే ఉంది. మార్కెట్ ట్రెండ్ ని ఫాలో అవక తప్పదు కదా . ఇవ్వాల్టి తరం ప్రతి అంశంలోనూ పర్యావరణహితాన్ని కోరుతున్నారు అందుకు అనువైన ఉత్పత్తులను ప్రోత్సహిస్తున్నారు.  ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని హెంప్ మొక్కల నారతో చేసిన దుస్తులు ఇప్పుడు ట్రేండింగ్ లో ఉన్నాయి. సాధారణంగా మనం మాములుగా ధరించే దుస్తులు మన్నిక ఉతికిన కొద్దీ తగ్గుతాయి కానీ ఈ హెంప్ నారా దుస్తులు ఉతికిన కొద్దీ మరింత నాణ్యమైన లుక్ తో కనిపిస్తాయి. టి-షర్టులు ,ఫార్మల్ దుస్తులు,ప్యాంట్ లు,చివరకు వెడ్డింగ్ గౌన్ లతో సహా పలు డిజైన్ లలో యువతను ఆకట్టుకుంటున్నాయి. కేవలం దుస్తులే కాదు హెంప్ బూట్లు,చెప్పులు మంకీ కాప్ లు,హాండ్ బాగ్ లు లాప్ టాప్ బ్యాగ్ లు వాచ్ లు అన్ని ఆన్ లైన్ లో దొరుకుతున్నాయి. ఈ  ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులు ఫ్యాషన్ కు కొత్త నిర్వచనాన్ని ఇస్తున్నాయి.

Leave a comment