పాలు బెల్లం కలిపి తాగితే అనేక ప్రయోజనాలు అంటారు వైద్యులు. ఈ శీతాకాలంలో రాత్రి వేళ నిద్రపోయే ముందర ఈ పాలు బెల్లం తాగితే మంచి నిద్ర వస్తుంది అలాగే శీతా కాల సమస్యలు, అస్తమా వంటివి ఉన్న వాళ్ళకి మంచి ఉపశమనం కూడా .పాలలో కాల్షియం ,బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటాయి. బెల్లం జీర్ణ సంబంధిత ఇబ్బందులను సరిచేస్తుంది. కడుపులో గ్యాస్ ఉత్పత్తి కాకుండా అడ్డుకోనే శక్తి బెల్లంలో ఉంటుంది. ఈ చల్లని రోజుల్లో నీటిలో బెల్లం ,మిరియాలు ,అల్లం ,దాల్చిన చెక్క పొడి ,పసుపు లవంగాలు ,యాలకులు వంటి సుగంధ ద్రవ్యలు కూడా కలిపి బాగా మరిగించి రోజుకోసారి తాగితే జీర్ణ సంబంధమైన అనారోగ్యాలు రావు. గ్యాస్ సమస్య అసలే రాదు. బెల్లం కలిపిన పాలు కీళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం ఇస్తాయి కూడా.

Leave a comment