నీహారికా,

ఇంట్లో ఆడపిల్ల వుందంటే ఆ అందమే అందం. మువ్వల పాదాలతో పాపాయి నడుస్తుంటే ఇంట్లో అందరి హృదయాలు మమకారంతో కరిగిపోతాయి. ఆ పాపాయి పెంపకం లో మాత్రం అమ్మ ఎంతో ప్రత్యేకత చూపించాలి. టీనేజ్ లోకి వచ్చారంటే పిల్లలు సొంత నిర్ణయాలు తీసుకోవాలనుకుంటారు అయితే వాళ్ళలో నిర్ణయాత్మక శక్తి, విశ్లేషణ ఉంటాయా అంటే ఆ వయస్సు వాటిని లక్ష్యం చేయనే చేయదు. కానీ వాళ్ళలో భావోద్వేగాలు అర్ధం చేసుకుని , వారి తీరు తెన్నులను అంచనా వేసే శక్తి అమ్మకు వుండాలి. టీనేజ్ అమ్మాయి అమ్మ దగ్గర క్రమశిక్షణ పాఠాలు నేర్చుకోవాల్సిందే. అవసరం అయినంత వరకే స్వేచ్చ ఇచ్చి అమ్మాయికి సంబందించిన సకల విషయాలు జల్లిడ పట్టే నేర్పు అమ్మకే వుండాలి. ఇవ్వాల్టి విద్యావంతులైన తళ్ళులు ఈ సూత్రం గట్టిగానే పట్టుకున్నారు. పిల్లల్ని బుద్దిగా, అందలం ఎక్కిస్తున్నారు. విద్యా అవసరాన్ని గుర్తించారు. ఏదైనా, దేనికి తల వుపిన చదువు విషయంలో రాజీ పాడారు అమ్మాలు అందుకే ఎలాంటి జోంటే కోనంగిలయినా ఐ.ఎ.ఎస్ లు, ఐ.పి. ఎస్ లు అయిపోతున్నారు. అమ్మలా రెండు చేతుల మధ్య అమ్మాయి భావిష్యత్తు భద్రం.

Leave a comment