ఈ మధ్య కాలంలో టెంపుల్ జ్యువెలరీ లో కొత్త ట్రెండ్ పనుగుల డిజైన్స్. బంగారం, వజ్రాలు, రత్నాలు, వన్ గ్రామ్ గోల్డ్ ఏ లోహం అయినా ఏనుగు రూపంలోనే హాట్ కేక్స్ లా అమ్ముడవ్వుతున్నాయి. ఇప్పుడో పాత కాలంలో పులిగోరు ఫ్యాషన్ అయినట్లు సాహసానికి, రాజధానికి ప్రతీకగా ఏనుగును ఆభరణంలో మలుస్తున్నారు కళాకారులు. నెక్లెస్ లు, లాకెట్ లు, చేవిపోగులు, చేతికడియాలు, ఉంగరాలు గజరాజుని ఇముడ్చుకొని అమ్మాయిలు మెచ్చే రూపంలో వస్తున్నాయి. నగల డిజైన్ లంటే పువ్వులు, ఆకులు లాగే తీర్చి దిద్దే రోజుల నుంచి గంభీరమైన గజరాజు నగలపైకి నడిచోచ్చాడు.

Leave a comment