Categories
ప్రాచీ ధబల్ ను మనదేశంలో బేకింగ్ క్వీన్ గా గొప్ప కేక్ ఆర్టిస్ట్ గా పిలుస్తారు. కేక్ ను కళాత్మకంగా సౌందర్యాత్మకంగా మలుస్తుంది ప్రాచి. ఆమె ఇటలీలో ప్రసిద్ధమైన మిలాన్ కేథడ్రల్ చర్చ్ కు రెప్లికా తయారు చేసింది. ఈ భారీ చర్చ్ తయారు చేసినందుకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ 2022 లో కి ఆమె పేరు నమోదయింది. ఈమె చేసే కస్టమైజ్ కేకులకు ఎన్నో ప్రశంసలు వస్తాయి. కలకత్తా లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ప్రాచీ కేక్ ఆర్టిస్ట్ గా సక్సెస్ ప్రారంభించింది.