Categories
బిడ్డ పుట్టాక తల్లి శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి.గర్భాశయం కుంచించుకుపోతుంది. రొమ్ముల్లో మార్పులు సరేసరి. ప్రసవం తర్వాత ఇంకేముంది అనుకోకుండా తల్లి అయిన స్త్రీ ఐరన్,కాల్షియం,ఫోలిక్ యాసిడ్ మాత్రమే వాడాలి. బాలింతలు తీసుకోవల్సిన ఆహారాన్ని పోస్ట్ పార్టమ్ న్యూట్రిషన్ అంటారు. వెయ్యి నుంచి రెండు వేల క్యాలరీల శక్తి గల ఆహారం తీసుకోవడం వల్ల త్వరగా కోలుకునేందుకు పాలు పడేందుకు తగిన శక్తి వస్తుంది.మాములు కన్నా 300 నుంచి 500 వరకు కేలరీల వరకు అధిక శక్తి ఇచ్చే ఆహారం తీసుకోవాలి.కాన్పు అయిన వెంటనే గర్భం ధరించకుండా చూసుకోవాలి. తల్లి అవయవాలు అన్ని తిరిగి గర్భదారణకు సిద్దం అయ్యేందుకు 18 నెలలు పడుతుంది.