కరోనా కష్ట సమయంలో సంపాదించిన డబ్బులు చాలా మటుకు దానం చేసి వితరణ లో ఫోర్బ్స్ జాబిదా లో స్థానం సంపాదించిందిన అక్షయ్ కుమార్ నటించిన సినిమా.ఈ టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ లో నటించడం లో కూడా ఆ హృదయం కనబడుతోంది పల్లెటూరి అబ్బాయి కేశవ జయ ను ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటాడు. ఆ ఊర్లో ఉన్న ఆచారం ప్రకారం ఇళ్ళల్లోనూ, బయట టాయిలెట్స్ లేవు.ఆడవాళ్ళు అందరూ తెల్లవారుజామునే లేచి ఆరుబయట ప్రదేశానికి వెళ్ళవలసిందే.ఆ పద్ధతి ఓర్చుకోలేని జయ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది.కేశవ ఆమె కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించవు.సనాతన ఆచార పరాయణుడైన తండ్రి ఇంట్లో టాయిలెట్ కట్టించేందుకు ఒప్పుకోడు జయ ఇల్లు ,భర్తనీ వదిలి వచ్చిన కారణం టాయిలెట్ అని పేపర్ల కెక్కు తోంది.టాయిలెట్లు కట్టించే విషయంలో అధికారులు చేసిన స్కామ్ బయటికి వస్తుంది.ప్రభుత్వం దిగి వస్తుంది. కథ సుఖాంతం.

Leave a comment