Categories
వరి లాగే వెదురు మొక్కకీ బియ్యం వస్తాయట.అయితే ఇది వెదురు మొలకెత్తిన 40,50 ఏళ్ళకి పూస్తాయి. అప్పడు అలా పండినా ధాన్యం ఎంతో ఖరీదు .ఈ వెదురు బియ్యంలో ఔషగుణాలు ఎన్నో ఉన్నాయి. తింటే రక్తంలో చక్కెర శాతం పెరుగదు. కీళ్ళ నొప్పులు రావు. కన్యాకుమారి అడవుల్లోని కణి గిరిజన జాతి ఈ వెదురు బియ్యాన్ని అపురూపంగా పండించుకొని పోషకాహారంగానూ సంతాన సాఫాల్యత కోసమూ తింటూ ఉంటారట. ప్రోటీన్స్ ,పీచు ఎక్కువ .పోటాషియం ,కాల్షియం వంటి ఖనిజాలు ఉండటం వల్ల కీళ్ళ నొప్పులు ,వెన్ను నొప్పలు తగ్గుతాయి. కొలెస్ట్రాల్ పెరగదు. ముధుమేహన్ని ,బి.పీ ని తగ్గించే శక్తి ఈ వెదురు బియ్యంలో ఉన్నాయి. ఈ వెదురు బియ్యంతో అన్నం తింటు ఉంటే నూరేళ్ళు ఆరోగ్యంగా బతకవచ్చునంటారు.