Categories

నగలన్నింటితో పాటు జడకు అలంకరించే నగల్లో బంగారు జడ కూడా అందమే . అచ్చంగా బంగారుతో చేసిన జడతో పాటు ,జడ మొత్తం అలంకరించేలా నెమలి పింఛం ,మామిడి పిందెలు ,దేవలా రూపాలతో ఏర్చి కూర్చి జడ బిళ్ళలూ ఎప్పటి నుంచో ఉన్న నగలే .నిజడ్ స్టాన్స్ అన్ కట్ డైమాండ్స్ ,ఎమరాల్ట్స్ పొదిగిన జడ బిళ్ళలు చాలా అందంగా ఉంటాయి. ఇవి జడ మొత్తం దగ్గర దగ్గరగా అమర్చుతారు . 22 క్యారెట్ల తో యాంటిక్ బంగారు నెమళ్ళ జడ దూచీలు ,ఎమరాల్ట్స్ కలగలిపి చాలా అద్భుతంగా ఉంటాంది. ఇలాంటి ఏ పెళ్ళిళ్ళకో అలంకరించుకొనేవి. ప్రత్యేకంగా అనిపించేవి కూడా .వధువుకు అందమిచ్చే ఈ జడల మోడల్స్ ఆన్ లైన్ లో చాలానే ఉన్నాయి.