ఎంత హడావిడీ,బిజీ అయినా సరే కాస్త సమయం అయినా వ్యాయామం కోసం ఖర్చు చేయాలనిపిస్తుంది . తక్కువ సమయంలో పిట్ గా అయిపోవాలి అనుకొంటే అందరికీ కుదిరే వ్యాయామం స్కిప్పింగ్. ఈ ప్రాథమిక వర్కవుట్స్ ను మొదలు పెట్టి రోజుకు 200 అయినా చేయాలి ఇంకా పెంచాలి అని మొదలు పెడతారు చేసే సందడిలో ఎక్కడో లెక్క తప్పిపోతూ ఉంటుంది . అలాటప్పుడు పనిని “స్మార్ట్ రోప్ రూకీ” కి అప్పగిస్తే సరిపోతుంది . ఇదే అన్ని ట్రాక్ చేస్తుంది . ఇదో స్మార్ట్ రోప్ . బ్లూ టూత్ ద్వారా ఫోన్ కి కనెక్ట్ చేయచ్చు . ఈ స్మార్ట్ రోప్ యాప్ ని ఇన్ స్టాల్ చేసుకొంటే ఎన్ని జంప్స్ చేస్తున్నాం ఎన్ని కేలరీలు ఖర్చు అయ్యాయి అన్ని వివరాలు చూడచ్చు .

Leave a comment