చలికాలంలో పెదవులకు పెట్రోలియం జెల్లి రాస్తారు. ఈ జెల్లీ లో ఇంకెన్నో లాభాలు ఉన్నాయి ఇందులో కొంచెం బాత్ సాల్ట్స్ లేదా పంచదార వేసి స్క్రబ్ లాగా వాడుకోవచ్చు చర్మం పై మురికిపోతుంది కనురెప్పలు వత్తుగా పెరగాలంటే నిద్రపోయేముందు వాటికి పెట్రోలియం జెల్లి రాసుకొంటే చాలు జెల్లిలో ముంచిన దూదితో మేకప్ తొలిగించుకోవచ్చు ఇది చర్మానికి పోషణ కూడా ఇస్తుంది. నాణ్యమైన జెల్లీ ప్రతి రోజు మొహానికి రాసుకొంటే ముడతలు తగ్గిపోతాయి. గోళ్ళకు ఈ జెల్లీ పట్టించి కాసేపు అలవదిలేస్తూ వుంటే పొడిబారకుండా ఉంటాయి.

Leave a comment