ధనుర్మాసం అంతా మనకు అనంతాళ్వారు,ఆండాళ్,శ్రీ రంగనాథస్వామిని పూజించి గోదాదేవి కళ్యాణం చేసి మోక్షం పొందడానికి తరిద్దాం.
అనంతాళ్వార్ తన పెంచిన పూలవనం లో పూలను మాలను చేసి శ్రీ రంగనాథస్వామి కైకర్యం చేసేవాడు.ఆ పూల సౌందర్యాన్ని,గుబాళింపును తనవితీరా ఆశ్వాదించాలని పవళింపు సేవ తరువాత పద్మావతి సమేత స్వామి పూలవనంలోకి ప్రవేశించి ఆ సౌందర్యాన్ని అనుభవిస్తూ పూలను చిందర వందర చేసారు.అది గమనించిన ఆళ్వార్ పూల దొంగలను పట్టుకుందామనగా స్వామి తప్పించుకున్నారు.అమ్మ వారు దొరికింది చెట్టుకి బంధించారు.
ఆళ్వార్కి నిజం తెలుసుకుని అపరాధం చేసినందుకు అమ్మవారిని పూలబుట్టలో కూర్చోబెట్టి రంగనాథస్వామి సన్నిధిలో వుంచారు.

నిత్య ప్రసాదం:కొబ్బరి,పులిహోర,దద్ధోజనం.

   -తోలేటి వెంకట శిరీష

Leave a comment