ఏడుకొండలవాడా వెంకట రమణ 

గోవిందా..గోవింద!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడపజిల్లా మనకు సుపరిచితమైనదే.అక్కడే మనకు దర్శనం ఇస్తారు శ్రీ లక్ష్మీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వారు.
తిరుమల తిరుపతి దేవస్థానం కంటే ముందు గడపగా ఈ క్షేత్రాన్ని తప్పకుండా దర్శనం చేసుకుంటారు భక్తులు.కాశీ,రామేశ్వరం,తిరుపతి కాలిమార్గాన వెళ్ళేవారు ముందుగా ఈ క్షేత్రానికి వచ్చి దర్శనం చేసుకుని కటాక్షం పొందుతారు భక్తులు.వేంకటేశ్వరుని దేవేరియైన బీబీ నాంచారమ్మను కూడా దర్శనం ఇస్తుంది.ఉగాది పండుగ పర్వదినాన ముస్లిం సోదరులు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు.

నిత్య ప్రసాదం: కొబ్బరి, పులిహోర,దద్ధోజనం

                 -తోలేటి వెంకట శిరీష

Leave a comment