కలంకారీ పుట్టిల్లు ఆంధ్రాలోని మాచలిపట్నం. పర్షియన్ల రాకతో ఈ కలంకారీ వస్త్రాలు ప్రపంచ దృష్టిలో పడ్డాయి. కలంకారీ లో వాడే రంగులన్నీ సహజమైనవి. తుమ్మజిగురు, కరక్కాయి, నల్లబెల్లం, తుప్పు ముక్కలు, దానిమ్మ కాయల తొక్కలు వంటి వాటి నుంచి నలుపు, ఎరుపు, పసుపు, నీలం, ఆకుపచ్చ వంటి 15 రకాల రంగులతో చేత్తో, లేదా బ్లాకులు అద్దే పద్దతిలో కలంకారీ వస్త్రాలు రుపొందిచి. స్కిన్ ప్రింటింగ్ ఇతర పద్దతులు వచ్చాయి. సవ్య సాచి, సశికాంత్ నాయిడు వంటి ఫ్యాషన్ డిజైనర్స్ కలంకారీ వస్త్రాలతో ఫ్యాషన్ డిజైన్ల పరంపరను సృస్తిస్తున్నారు. ప్యాంట్లు, పాలాజాలు, చుడీదార్లు, అనర్కలీలు చీరలు, బ్లవుజులు ఇలా ఆధునిక సంప్రదాయ దుస్తులంన్నింటి పైన కలంకారీ కళ కపిస్తుంది. అంతేనా గొడుగులు, కప్పులు, చెప్పులు, గాజులు, బ్యాగులు, బాక్స్ లు కూడా కలంకారీ కళని అడ్డుకుని కనువిందు చేస్తాయి. అంతర్జాతీయ వేదికలపైన వయ్యారాలు పోతూ కొత్త ట్రెండ్ సృష్టిస్తుంన్నాయి.

Leave a comment